Tuesday, November 9, 2010

ఏ సైజ్ ఫైళ్లు అయినా నేరుగా మీ స్నేహితులకు పంపుకోవడం

ఇంటర్నెట్లో ఫైళ్లని మీ స్నేహితులతో షేర్ చేసుకోవడానికి రేపిడ్ షేర్, మెగా అప్ లోడ్, సెండ్ఇట్ వంటి అనేక సర్వీసులు ఉన్నాయి. అయితే ఫైల్ ని పూర్తిగా అప్ లోడ్ చేసిన తర్వాత మాత్రమే మన స్నేహితులు మనం పంపించే లింకు ఆధారంగా ఆ ఫైల్ని డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. అదీ కాక ప్రతీ ఫైల్ హోస్టింగ్ సర్వీస్ కి ఫైల్ సైజ్ విషయంలో గరిష్ట పరిమితి ఉంటోంది. చాలా తక్కువ సర్వీసులు మాత్రమే పరిమితి లేకుండా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ఫైళ్లని పంపుకోవడానికి కొంతమంది యాహూ మెసెంజర్లోని Send File వంటి ఆప్షన్లని వాడుతుంటారు. అయితే Gtalk వంటి ప్రోగ్రాముల్లో ఈ Send File సదుపాయం ద్వారా కొన్ని ఫైల్ టైప్ లకు చెందిన ఫైళ్లని మాత్రమే పంపుకోవచ్చు. ఇలా ప్రస్తుతం ఉన్న అన్ని మార్గాల కన్నా నన్ను ఈ మధ్యhttp://www.pipebytes.com/ అనే సర్వీస్ ఒకటి బాగా ఆకట్టుకుంది. ఇందులో ఉండే Send File అనే బటన్ ని క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఉండే ఫైల్ ని ఎంచుకుంటే వెంటనే ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ ని ఆన్ లైన్ లో ఉన్న మన స్నేహితునికి ఇస్తే.. ఇక్కడ మన కంప్యూటర్ నుండి ఒక పక్క ఆ ఫైలు అప్ లోడ్ చేయబడుతూనే మరో పక్క అతని కంప్యూటర్ లో మన అప్ లోడ్ చేసే ఫైల్ వెంటనే డౌన్ లోడ్ చేయబడుతుంటుంది. ఇతర వెబ్ ఆధారిత ఫైల్ మార్పిడి సేవల కన్నా ఇది రెండు రెట్లు వేగంగా ఉంటోంది. ఒక పక్క ఫైల్ అప్ లోడ్ చేయబడుతుంటే మనకు టైమ్ పాస్ అవడానికి YouTube వీడియోలు మన బ్రౌజర్ లో ప్లే చేయబడుతుంటాయి.

1 comment: